'యానిమల్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేశ్ బాబు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ట్రైలర్ చూసిన వెంటనే మెంటల్ వచ్చేసిందని చెప్పారు. తానెప్పుడూ ఇలా చెప్పనని, మనస్ఫూర్తిగా ఫీలైతేనే మాట్లాడతానని అన్నారు. ఈ సందర్బంగా భార్యను ఎలా మేనేజ్ చేయాలో టిప్ చెప్పాలని యాంకర్ సుమ కోరగా.. ఎప్పుడూ నవ్వుతూ ఉంటే మేనేజ్ చేయగలుగుతామని నవ్వుతూ రిప్లై ఇచ్చారు. దీంతో తెగ వైరల్ అవుతోంది.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలివుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'యానిమల్'. సోమవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ యానిమల్ ట్రైలర్ చూసి నాకు మెంటలొచ్చేసిందన్నారు. అలాగే తాను రణ్‌బీర్ కపూర్‌కి పెద్ద అభిమానిని మహేష్ చెప్పుకొచ్చారు.