రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన వైల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘యానిమల్’. ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమాపై బీభత్సమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఇందులో రణ్‌బీర్ కపూర్‌కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించగా.. స్టార్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సినిమాని చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ ట్విట్టర్ వేదికగా తన స్పందనను తెలియజేశారు. ‘‘రణ్‌బీర్ కపూర్.. మీలోని మాస్ సూపర్‌స్టార్ ఈ యానిమల్తో బయటికొచ్చాడు. మీ పెర్ఫార్మెన్స్ జీవితాంతం గుర్తుండిపోతుంది. రష్మిక మందన్నా.. ఇప్పటి వరకు మీరు చేసిన పాత్రలలో బెస్ట్ పాత్ర ఇదేనని భావిస్తున్నాను. సెకండాఫ్‌లో వచ్చే గొడవ సన్నివేశం నాకు బాగా నచ్చింది. ఆ సీన్‌ని అద్భుతంగా చిత్రీకరించారు. సందీప్ వంగా.. మీరు మాత్రమే ఇటువంటి సన్నివేశాలను ఊహించగలరు. మీరు సృష్టించిన ట్రాన్స్ నుంచి బయటికి రావడానికి చాలా టైమ్ పట్టింది’’ అని కార్తికేయ తన ట్విట్టర్లో ‘యానిమల్’ సినిమాపై రియాక్ట్ అయ్యారు.