మొత్తానికి యావత్ దేశం, ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ఇండియా చిత్రం 'సలార్' . ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు దాటి ఎక్కడికో పోగా.. ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా నెలల పైబడి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వారిని సంతృప్తి పరుస్తూ ట్రైలర్ ఎట్టకేలకు చెప్పిన విధంగానే రాత్రి 7.19 గంటలకు విడుదలైంది. 3 నిమిషాల 47 సెంకడ్ల నిడివితో ఈ ట్రైలర్ ఆద్యంతం ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టుగా రూపొందింది. రెండు రోజుల ముందు నుంచి సోషల్‌మీడియా ఎక్స్‌లో సలార్ ట్రైలర్ డే అంటూ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉందంటే బజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.ట్రైలర్‌లో ఒక్కో సీన్ గూస్‌బంప్స్ తెచ్చేలా ఉండగా రవి బసూర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అంతకు మించి అనేలా ఉంది. వీటన్నింటిని మించి ఒక్కో పాత్ర డైలాగ్స్ అయితే ఫ్యాన్స్‌కు పిచ్చెక్కించేలా ఉన్నాయి. యాక్షన్ సీన్స్ భీబత్సమే అన్నట్లుగా ఉన్నాయి. ప్రభాష్ కు ఇచ్చిన ఎలివేసన్స్ అయితే అంతకుమించి అనేలా ఉన్నాయి. మొత్తంగా ట్రైలర్ చూస్తే kgfను తలదన్నేలా ఉన్నాయి. కేజీఎఫ్, కాంతారా వంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్నది. ఈ క్రమంలో మొదటి భాగం సలార్ సీజ్‌ఫైర్ పేరుతో కిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నారు. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. మలయాళ ఆగ్ర నటుడు పృథ్విరాజ్ ప్రతినాయకుడిగా చేస్తుండగా, జగపతి బాబు, శ్రీయా రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో కనపడనున్నారు. ఇదిలాఉండగా షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరానీ కాంబినేషనన్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'డంకి' పాన్ ఇండియా సినిమా అదే రోజు దేశవ్యాప్తంగా విడుదల కావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్‌గా ఉంది.అయితే సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ సినిమానపై అభిమానులు పెట్టుకున్న హోప్స్ ఒక్కోక్క దానికి క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘కేజీఎఫ్’ చిత్రంతో ‘సలార్’ను పోల్చుకోవద్దనీ, ఈ సినిమా చాలా విభిన్నం అని ప్రశాంత్ నీల్ ఓ ఆంగ్ల వెబ్ సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘బద్ధ శత్రువులుగా మారిన ఇద్దరు మిత్రుల కథ ఇదనీ, ఇందులో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ స్నేహితులుగా నటిస్తున్నారన్నారు. కథలో సగ భాగం ఫస్ట్ పార్ట్‌లో ఉంటుందని, కథ డిమాండ్ మేరకు రెండో భాగాన్ని కూడా తీయాల్సి వచ్చిందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రామోజీ ఫిల్మ్‌సిటీలో సిమ్రత్‌కౌర్ తదితరులపై రాజు సుందరం నృత్య దర్శకత్వంలో ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించగా తదుపరి సినిమా సెన్సారు కార్యక్రమాలకి సన్నాహాలు చేస్తున్నట్టుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది. అందుకోసమం ఇందులో పనిచేసిన ఆర్టిస్టుల చేత డబ్బింగ్ చెప్పించే పనిలో చిత్ర నిర్వాహకులు ఉన్నారు. ఈ చిత్రం ఐమాక్స్ వెర్షనలో కూడా రిలీజ్ కానుంది.