ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిసెంబర్ 21న విడుదలకానున్న ‘డంకీ’

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2023, 12:00 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూక్, రాజ్ కుమార్ హిరాణి కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘డంకీ’. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి విడుదలవుతోన్న కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది. ఇప్పటికే ‘డంకీ డ్రాప్ 2’ అంటూ ‘లుట్ పుట్ గయా..’ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రీతమ్ సంగీత సారథ్యంలో ఈ సాంగ్‌ను సోనూ నిగమ్ అద్భుతంగా పాడారు. దీంతో పాటు డంకీ డ్రాప్ 1 అంటూ ఓ వీడియోను కూడా అంత కంటే ముందుగానే మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీటిని ప్రేక్షకులు అపూర్వంగా ఆదరించారు. షారూక్, సోనూ నిగమ్ కాంబినేషన్‌లో వచ్చిన పాటలన్నీ పెద్ద హిట్ సాంగ్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డంకీ కోసం వీరిద్దరూ మరోసారి ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ సాంగ్‌తో మ్యాజిక్‌ను క్రియేట్ చేశారు. డంకీ డ్రాప్ 3లోని ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ సాంగ్ సినిమాలో ఎమోషనల్ పార్ట్‌లో వస్తుందనే విషయాన్ని తెలియజేస్తుంది. నలుగురు స్నేహితులు విదేశాలకు వెళ్లాలని తాపత్రయ పడతారు. వారి భావోద్వేగ ప్రయాణంలో ఉండే ఆరాటాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ పాటలో భవిష్యత్తులో బావుండాలనే ఉద్దేశంతో విదేశాల్లో ఉంటుంటారు. అలాంటి వారు తమ మాతృదేశానికి దూరమై దానిపై చూపించే ప్రేమను ఈ పాట వెల్లడి చేస్తుంది. కొన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని రాజ్ కుమార్ హిరాణి.. ఈ ‘డంకీ’ సినిమాను హృద్యంగా తెరకెక్కించారు. ఇది ప్రేమ, స్నేహం వంటి భావోద్వేగాలను ఆవిష్కరించే చిత్రం. సినిమాలో పాత్రలు ఎదుర్కొనే సమస్యలను నవ్వు తెప్పించేలా చూపిస్తూనే గుండె పొరలను తాకేంత భావోద్వేగంతో నిండి ఉండేలా ఉంటాయని మేకర్స్ చెబుతుననారు.హర్డీ, మను, బగ్గు, బల్లి అనే స్నేహితులు వారి జీవితాన్ని మార్చే ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు వారికి ఇల్లు, తమకిష్టమైన వారిని చూడాలనే కోరిక ఎలా ఉంటుందనే విషయాన్ని వివరించారు. ‘నికలె ది కబీ హమ్ ఘర్ సే’ పాటతో మనకు కావాల్సిన వారికి దూరంగా ఉన్నప్పుడు మనసులో ఉండే వేదను పాట రూపంలో చెప్పే ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశారు. హద్దులు దాటి హృదయాలను కలుపుతూ, కలలను నిజం చేసుకోవడానికి సాహసించే వారి చేదు తీపి ప్రయాణాన్ని ఈ పాట తెలియజేస్తుంది. ఏ జియో స్టూడియోస్‌, రెడ్ చిల్లీస్ ఎంట‌ర్‌టైన్మెంట్‌, రాజ్‌కుమార్ హిరాణి ఫిల్మ్స్ బ్యాన‌ర్స్‌ స‌మ‌ర్ప‌ణ‌లో రాజ్ కుమార్ హిరాణి, గౌరి ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com