ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను అలా చెయ్యడం కథకి చాలా అవసరం

cinema |  Suryaa Desk  | Published : Thu, Dec 07, 2023, 05:11 PM

త్రిప్తి డిమ్రి పేరు ఇప్పుడు ప్రతి దగ్గరా మారుమోగుతోంది. ఆమె అగ్ర నటి అని కాదు, లేదా ఆమె కథానాయకురాలిగా చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించింది అని కాదు. ఆమె 'యానిమల్' సినిమాలో చేసిన ఒక బోల్డ్ సన్నివేశంతో ఆమె పేరు మారుమోగిపోతోంది. సందీప్ రెడ్డి వంగా  దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. ఈ సినిమాలో రెండో సగంలో రణబీర్ కపూర్ తో త్రిప్తి డిమ్రి కనిపిస్తుంది. అందులో భాగంగానే ఒక సన్నివేశంలో రణబీర్ తో పాటు త్రిప్తి నగ్నంగా కనిపిస్తారు. ఈ సన్నివేశం చెయ్యడానికి చాలా ధైర్యం ఉండాలి, అలాగే ఇది ఒక బోల్డ్ సన్నివేశం. దీని గురించి త్రిప్తి ఇంతవరకు మాట్లాడలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. విడుదలైన రోజు ఏమీ అంత బజ్ ఆమె గురించి రాలేదుట, కానీ రెండో రోజు నుంచీ ఆమె గురించి అందరూ ఆరా తీయడం మొదలెట్టారు అని చెప్తోంది. ఆమెకి కూడా చాలా మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వచ్చాయి అని చెప్తోంది. "ఈ సినిమా రంగంలోకి రావటానికి, నటిని అవడానికి ఎవరూ నన్ను ఫోర్స్ చెయ్యలేదు. నాకిష్టమై నేను వచ్చాను. నటనలోకి దృష్టి పెట్టాక, నేను అన్ని రకాల పాత్రలను పోషించాలని అనుకున్నాను. నా పాత్ర కథకి ఎంత అవసరమో అంత చెయ్యడానికి కూడా నేను సిద్ధం అయ్యాను," అని చెప్పుకొచ్చింది. ఈ 'యానిమల్' సినిమా గురించి మాట్లాడుతూ, ముందుగా దర్శకుడు సందీప్ వంగా ఆ సన్నివేశం గురించి చెప్పారు, అలాగే కథ కూడా నేరేట్ చేశారు. నేను అలా చెయ్యడం కథకి చాలా అవసరం అనుకున్నాను, అందుకే చేసాను. షూటింగ్ చేసేటప్పుడు కేవలం నలుగురం మాత్రమే ఆ గదిలో వున్నాము అని చెప్పింది త్రిప్తి. "నేను, రణబీర్ కపూర్, దర్శకుడు సందీప్, సినిమాటోగ్రఫర్ మేము నలుగురమే ఆ గదిలో వుండి ఈ సన్నివేశం చేసాము. ప్రతి ఐదు నిముషాలకి దర్శకుడు సందీప్ నన్ను 'అర్ యు ఒకే' అని అడుగుతూనే వున్నారు. అలాగే ఈ సన్నివేశం చేసేటప్పుడు రణబీర్ ఎంతో నెర్వస్ గా ఫీల్ అయ్యారు, ఇది కథకి అవసరం," అని చెప్పింది త్రిప్తి ఆ సన్నివేశం గురించి. రణబీర్ చాలా మంచి నటుడే కాకుండా, మంచి వ్యక్తి కూడా. ఇందులో ఇంకో సన్నివేశం ఉంటుంది, అది నేను ఏమి జరిగిందో నిజం చెప్పడం, అప్పుడు నేను కొంచెం నెర్వస్ గా ఫీల్ అయితే, రణబీర్ అప్పుడు తాను కొత్త నటి అని చూడకుండా ఎంతో సపోర్ట్ చేసారని చెప్పింది. త్రిప్తి మొదటి క్రష్ షా రుఖ్ ఖాన్ అయితే, రణబీర్ కపూర్ రెండో క్రష్ అని చెప్పింది. "అతనితో నటించడం చాలా ఆనందంగా వుంది, అతను ఒక గొప్ప నటుడు, అలాగే గొప్ప మనిషి కూడా" అని చెప్పింది. ఇంతకు ముందు సినిమా 'బుల్ బుల్' లో రేప్ సన్నివేశంలో చెయ్యడం కష్టం అయింది, కానీ ఈ 'యానిమల్' లో ఇంటిమేట్ సన్నివేశం చెయ్యడం చాలా సులువుగా చేసేసా అని చెప్పింది త్రిప్తి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com