ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు తనయుడు అభిరామ్ ఓ ఇంటివాడయ్యారు. దగ్గుబాటి కుటుంబానికి అత్యంత దగ్గర బంధువుల అమ్మాయి ప్రత్యూషను ఆయన వివాహం చేసుకున్నారు. మూడు రోజులపాటు జరిగిన ఈ వివాహ వేడుకకు శ్రీలంకలోని ఓ రిసార్ట్ వేదికైంది. కుటుంబ సభ్యులు, కొందరు అతిథుల సమక్షంలో అభిరామ్, ప్రత్యూష మెడలో మూడు ముళ్లూ వేశారు. శ్రీలంక నుంచి తిరిగొచ్చాక హైదరాబాద్‌లో రిసెప్షన ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. 'అహింస' చిత్రంతో అభిరామ్ హీరోగా తెలుగుతెరకు పరిచయమయ్యాడు. తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తనని హీరోగా చూడాలనే రామానాయుడు కోరిక ఆయన ఈ చిత్రంతో తీర్చారు. ఈ ఏడాది జూనలో విడుదలైన ఈ చిత్రం సక్సెస్ కాలేకపోయింది.