రీసెంట్ గా హాయ్ నాన్న సినిమాతో మంచి సక్సెస్ ను అందుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. నాని జోడీగా నటించిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ లు మాత్రమే తీసుకుంటూ.. సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది మరాఠీ భామ. టాలీవుడ్ లో దూసుకుపోతోంది హీరోయిన్ మృణల్ ఠాకూర్. ఆలోచించి అడుగులు వేస్తోంది. సినిమాల విషయంలో రాంగ్ స్టెప్స్ తీసుకోకుండా..మంచి సినిమాలు ఎంచుకుని చేస్తోంది. ఇటు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే అటు బాలీవుడ్ లో కూడా మంచి మంచి ఆఫర్లు అందుకుంటుంది. బాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లు తీసుకుంటుంది మృణాలు. టాలీవుడ్ లో కూడా వరుస ఆఫ్లు వస్తున్నా.. మంచి కాన్సెప్ట్ లకే ఓటు వేస్తోంది. హాయ్ నాన్న అయిపోయింది. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ జోడీగా మరో సినిమా చేస్తోంది. తాజాగా మృణాల్ఠాకూర్కు సబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె పెళ్లికి సబంధించిన న్యూస్ ఒకటి ట్రెండింగ్ లో ఉంది. మృణాల్ ఠాకూర్ పెళ్లి గురించి ఈ మధ్య జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ బ్యూటీ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది. మృణాల్ ప్రస్తుతం న్యూజెర్సీలో ఉంది. విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం ఆమె న్యూజెర్సీ వెళ్ళింది. ఇక గతంలో కూడా మృణాల్ పెళ్ళి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే అప్పుడు కూడా క్లారిటీ ఇచ్చింది బ్యూటీ. ఇప్పుడు తన పెళ్లి గురించి డిస్కర్షన్ అసలు లేదని..తాను ఎంతో సాధించాలి అన్నారు. పెళ్ళిచేసుకోవాలి అనుకున్నప్పుు తానే స్వయంగా ప్రకటిస్తాను అన్నారు.