నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ శుక్రవారం విడుదల ఐనది. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించారు. విడుదల సందర్భంగా నితిన్ మీడియాతో మాట్లాడుతూ ‘రెండున్నర ఏళ్ల క్రితం వంశీగారు ఈ స్టోరీ లైన్ చెప్పారు. అది స్ర్కిప్ట్‌గా మారడానికి ఇంత టైమ్ పట్టింది. నా గత సినిమా సరిగ్గా ఆడకపోవడంతో ఈ ప్రాజెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టా. సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. నేను జానియర్ ఆర్టిస్ట్ పాత్ర పోషించాను. హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పటి వరకూ వంశీ రాసిన పాత్రల్లో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇందులో తండ్రీకొడుకుల సెంటిమెంట్ కాకుండా వారి ఎంటర్‌టైన్‌మెంట్ ఆకట్టుకుంటుంది’ అన్నారు. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ కథ కొత్తది కాకపోయినా పాయింట్ కొత్తగా ఉంటుందని చెబుతూ ‘స్ర్కీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. ఇలాంటి ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ ఈ మధ్య కాలంలో రాలేదని చెప్పాలి. సంపత్‌గారు ఇదివరకు పోలీస్, తండ్రి పాత్రలు చాలా పోషించారు. కానీ ఇందులో వారి పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో రావు రమేశ్‌గారి పాత్ర తర్వాత సంపత్‌గారి పాత్రకే జనాలు ఎక్కువ కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు నితిన్. డాక్టర్ రాజశేఖర్ గురించి మాట్లాడుతూ ‘ఆయన పాత్ర సెకండా్‌ఫలో ఉంటుంది. ఆయన ఎంటర్ అయ్యాకే సినిమా నెక్ట్స్ లెవల్‌కు వెళుతుంది. ఈ పాత్ర చేయడానికి ఆయన ఒప్పుకుంటారా, లేదా అనుకున్నాం. దర్శకుడు వంశీ మాత్రం మొదటి నుంచి ఆయన చేస్తే బాగుంటుంది అనేవారు. శివానీ, శివాత్మిక కూడా రాజశేఖర్‌గారిని ఒప్పించారు’ అన్నారు. ‘నాకు దైవ చింతన, భక్తి ఎక్కువ. ‘శ్రీ ఆంజనేయం’ తర్వాత మళ్లీ నాకు అలాంటి కథలు ఎవరూ చెప్పలేదు. నాకు ఆ జానర్‌లో ఓ సినిమా చేయాలని ఉంది’ అని తెలిపారు నితిన్.