యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో చిత్రమిది. విస్మయానికి గురైన ఓ తీర ప్రాంతం నేపథ్యంలో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా వస్తున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్స్ మాత్రమే రిలీజ్ చేశారు. అభిమానులు నెక్ట్స్ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. తర్వాతి అప్డేట్ టీజర్ అని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. డిసెంబర్ 25 లేదా జనవరి ఒకటో తేదీన టీజర్ వస్తుందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే తాజా సమాచారం ప్రకారం 'దేవర’ టీజర్‌ని సలార్, డంకీ విడుదలయ్యే థియేటర్స్‌లో చూడొచ్చని శుక్రవారం నుంచి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. కానీ సోషల్ మీడియా , ఫ్యాన్స్ పేజీల్లో ఈ వార్త విపరీతం వైరల్ అవుతోంది. ఓవర్సీస్లో డంకీ సినిమాకి, ఇండియాలో సలార్ సినిమాకి సూపర్ బజ్ ఉంది. ఈ చిత్రాలతో 'దేవర' టీజర్ విడుదల చేస్తే రీచ్ బావుంటుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలో ఎంత నిజమెంత ఉందో తెలియాలంటే మేకర్స్ మాట్లాడాల్సిందే! జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల అల్యూమినియం ఫ్యాక్టరీలో సైఫ్ అలీఖాన్ పై ఇంట్రడక్షన్ సీన్స్ తీశారు.