కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ తన 62వ ప్రాజెక్ట్ ని యువ తమిళ దర్శకుడు మగిజ్ తిరుమేనితో చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఇప్పటికే అజర్బైజాన్లో కొన్ని కీలకమైన షెడ్యూల్‌లను మూవీ మేకర్స్ ముగించారు. తాజాగా ఇప్పుడు యూనిట్ తదుపరి మేజర్ షెడ్యూల్ కోసం అజర్‌బైజాన్‌కు తిరిగి వెళ్ళింది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అజిత్ మరియు త్రిష వాకింగ్ చేస్తున్న అనేక చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాలో అజిత్ కి జోడిగా తమిళ స్టార్ నటి త్రిష జోడిగా కనిపిస్తుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ బిగ్గీలో హిందీ నటుడు సంజయ్ దత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. కోలీవుడ్ హిట్ మెషిన్ అనిరుధ్ రవిచందర్ ఈ హై బడ్జెట్ ఎంటర్టైనర్కు సంగీతం అందిస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.