సినీ ఇండస్ట్రీ తరపున తనను ఎవరూ కలవలేదని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఆర్ అండ్ బీ శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సినిమాటోగ్రఫీ శాఖకు సంబంధించిన ఫైళ్లపై ఏమైనా సంతకం చేశారా అని విలేకరులు అడగ్గా.. అసలు సినీ ఇండస్ట్రీ వాళ్లు ఎవరూ తనను కలవలేదని అన్నారు. నిర్మాత దిల్రాజు ఒక్కరే ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు.