మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు, నష్టాల గురించి అవగాహన కల్పించేలా ‘లైఫ్ ఇరుక్కు ... డ్రగ్స్ ఎదర్కు’ అనే పేరుతో రూపొందిన ప్రచార గీతాన్ని తమిళనాడు రాష్ట్ర డీజీపీ శంకర్ జీవాల్ చెన్నై నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తాజాగా ఆవిష్కరించారు. గేయరచన చేసిన వైసాగ్... నేపథ్యగానం కూడా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు జిబ్రాన్ సంగీతం అందించారు. ఈ ప్రచార గీతం తయారీలో తమిళనాడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (టీఎన్ సీఐడీ) కీలక భూమికను పోషించింది.