ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'డెవిల్' నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ డిస్ట్రిబ్యూటర్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 03:23 PM

నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. డిసెంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలై సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకు హైప్ బాగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమాని దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా ఏషియన్ సునీల్ నైజాం రైట్స్ ని సొంతం చేసుకున్నాడు.

ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ జోడిగా కనిపించనుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ ఒక చీకటి రహస్యాన్ని ఛేదించే లక్ష్యంతో నిర్భయ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపిస్తారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa