ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సంఘ‌మిత్రలో అడుగు పెట్టిన దిశా పటానీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 23, 2017, 10:38 AM

 సుంద‌ర్.సి భారీ బ‌డ్జెట్ తో సంఘ‌మిత్ర చిత్రాన్ని తెర‌కెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో లీడ్ రోల్ లో తొలుత శృతిహాసన్ ను ఎంపిక చేసినప్పటికీ..ఈ ప్రాజెక్టు నుంచి శృతి తప్పుకుంది. ఆ తర్వాత ఈ పాత్ర కోసం హన్సికనుతీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. చివరగా ‘సంఘమిత్ర’ కోసం చిత్రయూనిట్ లోఫర్ ఫేం దిశా పటానీ ని ఫైనల్ చేసింది. ఈ విషయాన్ని దిశా ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. సంఘమిత్ర మూవీలో అవకాశం రావడం పట్ల ఎక్సయిటింగ్ గా ఉందని ట్వీట్ చేసింది. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేసింది దిశా. ఈ సినిమాలో జ‌యం ర‌వి, ఆర్య ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్ లో సంఘమిత్ర పోస్టర్స్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్. 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa