‘సలార్’ సినిమాపై నటి పాయల్ ఘోష్ షాకింగ్ కామెంట్స్ చేసింది. 'సలార్' ఓ చెత్త సినిమా అని. ఈ ఏడాది విడుదలైన సలార్, డంకీ, పఠాన్, జవాన్, యానిమల్ చిత్రాలు బాగాలేవని, జనాలను పిచ్చోళ్లను చేసేలా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘రాజ్ కుమార్ హిరాణీ తన కెరీర్లో తొలిసారిగా ఓ ఫ్లాప్ సినిమా తీశారు' అని ట్విట్టర్ వేదికగా విమర్శించింది. ప్రస్తుతం పాయల్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.