నవీన్ మేడారం దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'డెవిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ ఇటీవల మీడియాతో ముచ్చటించారు. ఒక ఇంటర్వ్యూలో, అతను దేవర-పార్ట్ 1 గురించి కొన్ని విషయాలని వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. చిత్ర బృందం VFXతో సంతృప్తి చెందిన తర్వాత దేవర గ్లింప్స్ విడుదల తేదీని వెల్లడిస్తుందని అతను ప్రకటించాడు.
డిసెంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్పై థ్రిల్లర్ డెవిల్ లో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ జోడిగా కనిపించనుంది. అభిషేక్ పిక్చర్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో కళ్యాణ్ రామ్ ఒక చీకటి రహస్యాన్ని ఛేదించే లక్ష్యంతో నిర్భయ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కనిపిస్తారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీత అందిస్తున్నారు.