వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రంలో నానికి జోడిగా OG బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. తాజాగా ఇప్పుడు నేచురల్ స్టార్ నాని మరియు ప్రియాంకమోహన్ మధ్య కొన్ని కీలక ఘట్టాలతో సరిపోద శనివారం షూటింగ్ ఈరోజు పునఃప్రారంభం అయ్యింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సరికొత్త పోస్టర్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రకటించింది. DVV ఎంటర్టైన్మెంట్కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.