సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ఫైట్ మాస్టర్ జోలీ బాస్టియన్ కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో గత రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో అయన మరణించారు. జోలీ బాస్టియన్ వయసు 57 ఏళ్లు. జోలీ బాస్టియన్ స్వస్థలం కేరళలోని అలెప్పి. తన సినీ కెరీర్లో కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 900 చిత్రాలకు స్టంట్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అన్నయ్య’ పోరాట సన్నివేశాలను జోలీ బాస్టియాన్ కంపోజ్ చేశారు.