ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటులు నాగార్జున, అమల దంపతులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకోవడంతో ఆయనను ఈ రోజు కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం కాసేపు సీఎం రేవంత్ తో నాగార్జున దంపతులు ముచ్చటించారు. ఈ భేటీ కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.