ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హ‌ర‌ర్ కామెడీ మూవీలో జాన్వీ కపూర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2019, 10:27 AM

అతిలోక సుంద‌రి శ్రీదేవి గారాల పట్టీ జాన్వీ క‌పూర్ ధ‌డ‌క్ అనే చిత్రంతో వెండితెర‌కి ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మ‌డు త‌క్త్ అనే భారీ బ‌డ్జెట్ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తుంది. మ‌రో వైపు ఐఏఎఫ్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితాధారంగా తెర‌కెక్కుతున్న చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తుంది. ఇటీవ‌ల‌ ఈ చిత్ర షూటింగ్ వార‌ణాశిలో జ‌రిగింది. జాన్వీ తాజాగా మ‌రో ప్రాజెక్ట్‌కి సైన్ చేసింది. రూ ఆఫ్జా అనే టైటిల్‌తో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు క‌థానాయ‌కుడిగా న‌టించ‌నున్నాడు. హ‌ర‌ర్ కామెడీ మూవీగా ఈ ప్రాజెక్ట్ రూపొంద‌నుంది. వ‌రుణ్ శ‌ర్మ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. హార్ధిక్ మెహ‌తా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని దినేష్ విజ‌న్‌, మృగ‌దీప్ సింగ్ లంబా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జూన్ 2019లో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రం మార్చి 20,2020న విడుద‌ల కానుంది. రూఫ్ ఆఫ్జా అనే చిత్రం ఒక చిన్న పట్ట‌ణం చుట్టూ తిరుగుతుంది. అక్క‌డ ఉండే ఓ దెయ్యం కొత్త‌గా పెళ్లైన పురుషుల‌ని ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంది. రూఫ్ ఆఫ్జా అనే మ‌హిళ త‌న భ‌ర్త రాత్రంతా మేలుకొని ఉండేందుకు భార‌తీయ తీపి పానీయం త‌యారు చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ క‌థ‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంద‌ని మేక‌ర్స్ అంటున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa