కన్నడ బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్ 'జెర్సీ' మూవీతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సంక్రాంతికి సైంధవ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఈ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో శ్రద్ధాను తన టాటూకి అర్థం ఏంటని ప్రశ్నించారు యాంకర్. ఆ టాటూకి అర్థం లవ్ అని, అది బీటల్స్ మ్యూజిక్ బ్రాండ్ లోగో అని చెప్పింది. 18 ఏళ్ల వయసులో తన క్రష్ ఆ మ్యూజిక్ బ్రాండ్‌ను పరిచయం చేశాడట. అలా 2 ఇష్టాలు కలిసేలా టాటూ వేయించుకున్నానని తెలిపింది.