గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ గ్యాంగ్‌స్టర్ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా మూవీస్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా జనవరి 15, 2024 మధ్యాహ్నం 12:00 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో స్మాల్ స్క్రీన్ లపై ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.