టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకతంలో చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్-అడ్వెంచర్ చిత్రానికి తాత్కాలికంగా OG అనే టైటిల్ ని మూవీ మేకర్స్ పెట్టారు. ఇటీవల OG కోసం ప్రొడక్షన్ హౌస్‌లలో మార్పు ఉంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ యాక్షన్ చిత్రం వెనుక ఉన్న పవర్‌హౌస్ అయిన DVV ఎంటర్‌టైన్‌మెంట్ "OG మాది...OG ఎప్పటికీ మాది" అని ధృవీకరించింది. ప్రొడక్షన్ హౌస్ పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు మరియు చిత్రం పై అభిమానులకు స్పష్టత ఇస్తూ "ఆకలి కొనసాగుతుంది, కానీ చిరుత వేట దేనినీ వదిలిపెట్టదు" అని పేర్కొన్నారు.
ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లో ప్రియాంక అరుల్ మోహన్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ బిగ్గీకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తుంది.