ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బుక్ మై షోలో 'గుంటూరు కారం' మ్యానియా

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 08:16 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి 'గుంటూరు కారం' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ జనవరి 12న థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ చిత్రం బుక్‌మైషోలో గత 24 గంటల్లో 6.67K టిక్కెట్లు అమ్ముడయినట్లు సమాచారం.

ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, రమ్య కృష్ణన్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com