ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హేమా మాలినిపై మండిపడుతున్న నెటిజన్లు..

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2024, 11:02 AM

సెల‌బ్రిటీలు, సినిమా తారలు కనిపిస్తే.. ఫోటోలు దిగాలి అనిపించడం సహజం, అది చాలా సాధార‌ణ విషయం. అయితే జనాలు ఎక్కవగా ఉండి.. సెలబ్రిటీని ఇబ్బంది పెట్టడం మాత్రంతప్పు. కాని ఖాళీ టైమ్ లో.. అభిమానులుఅడిగిన ఫోటోలు, ఆటోగ్రాఫ్ లు కాదనకుండా ఇస్తుంటారు స్టార్స్. కొంత మంది సెలబ్రిటీలు అయితే అభిమానులు చిన్నబుచ్చుకోకుండా.. ఎంత బిజీగా ఉన్నా.. కాదనకుండా ఫోటోలు దిగుతారు. అడిగినవారికి సెల్ఫీలు ఇవ్వడంతో పాటు ఆటోగ్రాఫ్ లుకూడా ఇస్తుంటారు. సహనం ఎక్కువ ఉన్న స్టార్లు ఇలా చేస్తుుంటారు. 


కాని కొంత మంది మాత్రంఎంత ఖాళీగా ఉన్నా.. అభిమానులు దగ్గరకు వస్తేచిరకు పడటం. వారిపట్ట అమానుషంగం బిహేవ్ చేయడం. నెట్టివేయడం, చీప్ గా చూడటం లాంటివి చేస్తుంటారు. అభిమానుల వల్ల వాళ్ళు ఈస్టేజ్ లో ఉన్నారన్న సంగతి మర్చిపోయి. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. అలాంటివారిలో బాలీవుడ్ డ్రీమ్ గళ్ల్ హేమామాలిని కూడా ఒకరు. తాజాగా ఆమె అకారణంగా ఓ అభిమానిని అవమానకరంగా మాట్లాడి బాధపెట్టారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే..? 


 


హేమా మాలినీ అన్న మాట వింటే.. మరోసారిసెల్ఫీ అడగకుండా ముఖం మీదే ఓ మాట అనేసింది సీనియర్ తార. రీసెంట్ గా ముంబయ్ లో..ప్రముఖ రచయిత గుల్జార్ బయోగ్రఫీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ  ఈవెంట్ కు హేమా మాలినీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ అభిమాని హేమమాలినీని సెల్ఫీ ఇవ్వాలని అడిగాడు. అందుకు ఆమె చిరాకుగా ఫేస్ పెట్టి..  `నీకు సెల్ఫీ ఇవ్వడానికి కాదు ఇక్కడకు వచ్చింది` అని అస‌హ‌నంగా మాట్టాడారు. దాంతో ఆఅభిమాని చిన్నబుచ్చుకన్నారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు  ఆమెపై మండిప‌డుతున్నారు. `సెల్ఫీ అడిగితే ఇంత పొగరుగా ప్రవర్తించాల్సిన అవసరం లేదని కొంతమంది నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com