‘హను-మాన్’మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతం ఆధారంగా ఎన్నో చిత్రాలు వచ్చాయి. నందమూరి తారక రామారావు ఇలాంటివి ఎన్నో చేశారు. మాకు ఎన్టీఆరే కృష్ణుడు, రాముడు. చాలా ఇళ్లలో దేవుడి విగ్రహాలతో పాటు ఆయన పోస్టర్లు ఉంటాయి’’ అని అన్నారు.