ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ రష్మిక బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశాడు

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2019, 12:42 PM

'అర్జున్ రెడ్డి' సినిమాతో యూత్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత వరుసగా యువత మెచ్చే చిత్రాలు చేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్నాడు. గీత గోవిందం సినిమాలో విజయ్ కి జోడిగా రష్మిక మందన నటించింది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది అంటే కారణం వారిద్దరి జంట మాత్రమే. అలాంటిది వాళ్ళిద్దరి కాంబినేషన్ లో 'డియర్ కామ్రేడ్' చిత్రం వస్తుంది. మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజున (ఏప్రిల్ 5) రష్మిక మందన పుట్టినరోజు. ఈ సందర్భంగా రష్మికకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, 'డియర్ కామ్రేడ్'లో ఆమె లుక్ కి సంబంధించిన ఒక స్పెషల్ పోస్టర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశాడు.ఈ సినిమా నుంచి ఫస్టు సాంగును ఈ నెల 8వ తేదీ(సోమవారం) ఉదయం 11 గంటల 11 నిమిషాలకి తెలుగుతో పాటు మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేయనున్న విషయాన్ని ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa