ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 05, 2019, 01:10 PM

అల్లు అర్జున్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉండనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పనులతోనే త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన లుక్ ను ఖరారు చేయడం కోసం ఇటీవలే ఫొటో షూట్ ను నిర్వహించారట. మొత్తానికి ఒక లుక్ ను ఫిక్స్ చేసుకున్నారనీ, అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఈ నెల 8వ తేదీన ఆ లుక్ ను రివీల్ చేయనున్నారని అంటున్నారు.

త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించి .. ఈ నెల 24వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగును ఆరంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన కథానాయికగా పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. ఈ సినిమా తరువాత వేణు శ్రీరామ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లడం కోసం ఆ ప్రాజెక్టును అల్లు అర్జున్ లైన్లో పెట్టేసే ఉంచాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa