కోలీవుడ్ స్టార్ హీరో తలైవర్ రజనీకాంత్ అభిమానులకు అత్యంత ఇష్టమైన మరియు గుర్తుండిపోయే చిత్రాలలో 'జైలర్' ఒకటి. ఈ సినిమా విపరీతమైన వసూళ్లను రాబట్టడమే కాకుండా సూపర్‌స్టార్‌కు కోల్పోయిన కీర్తిని కూడా తెచ్చిపెట్టింది. జైలర్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.
సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి జైలర్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్‌తో జైలర్ సీక్వెల్ ని చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ అప్డేట్ ప్రకారం, నెల్సన్ ఇప్పటికే జైలర్ 2 స్క్రిప్ట్ కోసం పని చేయడం ప్రారంభించాడు. రజనీకాంత్ ప్రస్తుతం T.J దర్శకత్వం వహిస్తున్న వేట్టయాన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.