రాహుల్ సదాశివన్ రచన మరియు దర్శకత్వంలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి తన కొత్త చిత్రాన్ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'బ్రహ్మయుగం' అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్లో రానున్నట్లు సమాచారం. తాజాగా ఇప్పుడు, ఈ చిత్రం ఫిబ్రవరి 16, 2024న విడుదల కానున్నట్లు మూవీ మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్ ఎల్ ఎల్ పి, వై నాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మిస్తున్నారు.