బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన రాబోయే చిత్రం ఎమర్జెన్సీలో భారత ప్రథమ మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పాత్రను పోషిస్తుంది. ఈ చిత్రం ఇందిరా గాంధీ పాలనలో 1975 నుండి 1977 వరకు కొనసాగిన “ఇండియన్ ఎమర్జెన్సీ” ఆధారంగా రూపొందించబడింది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని లాక్ చేసింది. తాజాగా ఇప్పుడు ఎమర్జెన్సీ 14 జూన్ 2024న విడుదల కానుంది. విడుదల తేదీతో పాటు మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు.
ఈ సినిమాకి కంగనా రనౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రేయాస్ తల్పాడే, అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, దివంగత సతీష్ కౌశిక్ మరియు విశాక్ నాయర్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణికర్ణిక ఫిల్మ్స్, జీ స్టూడియోస్ బ్యానర్లపై రేణుపిట్టి, కంగనా రనౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తుంది.