ఎన్టీఆర్ ‘దేవర’ వాయిదా పడనుందా? ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్ 5న రావడం లేదా? ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ఇది. అయితే దీనికి అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొదటి పార్ట్‌ను ఏప్రిల్ 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే విజువల్ ఎఫెక్ట్స్ పనులు, విలన పాత్రధారి సైఫ్ అలీఖాన్ గాయపడటం తదితర కారణాలతో సినిమాని వాయిదా వేయాలనే నిర్ణయానికి చిత్రబృందం వచ్చినట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ డిఫనెంట్గా కనిపిస్తోంది. అయితే గతంలో ఎప్పుడూ లేనంత రఫ్ లుక్‌లో తారక్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఎన్టీఆర్ రోల్‌కు సంబంధించి ఓ కీలక ట్విస్ట్ ఉండబోతున్నటు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆ ట్విస్ట్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలవబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆ లుక్కు సంబంధించిన గ్లింప్స్ వదలబోతున్నారట. ఈ విషయం విన్న తారక్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్ సమర్పకులు.