ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అలాంటిదేమి లేదు

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 25, 2024, 04:34 PM

మొన్న జరిగిన అయోధ్య సంబరంలో కంగనా రనౌత్‌ చేసిన హడావిడీ అంతాఇంతాకాదు. ‘జై శ్రీరామ్‌.. జై శ్రీరామ్‌’ అంటూ గొంతు పోయేలా నినాదాలు చేశారు కంగనా. తద్వారా రామచంద్రమూర్తిపై తనకున్న భక్తివిశ్వాసాలను తెలియజేశారు. అంతాబాగానే ఉంది. ఈ వేడుకకు కంగనాతోపాటు ‘ఈజ్‌ మై ట్రిప్‌’ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్‌ పిట్టి కూడా హాజరయ్యారు. ఇద్దరూ కలిసి అయోధ్య రామమందిరం ఎదురుగా ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. అక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఈ ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవ్వడంతోపాటు.. నిషాంత్‌, కంగనా రిలేషన్‌లో ఉన్నారంటూ వదంతులు కూడా సాంఘిక మాధ్యమంలో వ్యాపించాయి. దాంతో ఖంగు తిన్న కంగనా... ఆలస్యం చేయకుండా వివరణ ఇచ్చేశారు. ‘దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలను నమ్మొద్దు. కలిసి ఫొటోలు దిగితే రిలేషన్‌లో ఉన్నట్టేనా? బుద్ధిలేకుండా ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తారు? నిషాంత్‌కి పెళ్లయింది. అతనికి ఓ కుటుంబం ఉంది. అతని వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంది. నేను ఇప్పటికే ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నాను. అతనెవరో, అతని వివరాలేంటో త్వరలోనే చెబుతాను. మంచి వార్త కోసం వెయిట్‌ చేయండి. ఇలాంటి పిచ్చి వార్తలు రాసి మమ్మల్ని విసిగించకండి’ అంటూ మండిపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com