టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ రాబోయే చిత్రంలో సుధీర్ బాబు ఒక క్రేజీ పాత్రను చేయడానికి అంగీకరించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ టాక్. ఈ సినిమా పేరును గోప్యంగా ఉంచారు కానీ ఒక స్టార్ డైరెక్టర్ సుధీర్‌ని సంప్రదించగా అతను ఆఫర్‌ను ఓకే చేసినట్లు సమాచారం. ఈ వార్త ఇంకా ధృవీకరించబడనప్పటికీ ఈ వార్త మెల్లగా ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్చల్ చేయడం ప్రారంభించింది. రవితేజ ఇప్పుడు హరీష్ శంకర్ తదుపరి సినిమా చేస్తున్నాడు మరియు మరో రెండు చిత్రాలకు కూడా సైన్ చేశాడు. మరి సుధీర్ బాబు ఏ ప్రాజెక్ట్ ని ఓకే చేసాడో చూడాలి.