టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నాలుగోసారి జతకట్టనున్న సంగతి తెలిసిందే. జులాయి, S/o సత్యమూర్తి మరియు అలా వైకుంఠపురములో తర్వాత వీరిద్దరూ ప్రతిష్టాత్మకమైన పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం మళ్లీ కలిసి పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ మరియు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లకముందే త్రివిక్రమ్ మరో స్టార్ తో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ తదుపరి చిత్రంలో నాని ప్రధాన పాత్రను పోషించడానికి చర్చలు జరుపుతున్నట్లు లేటెస్ట్ టాక్. అయితే ఈ వార్తల గురించి ఎటువంటి నిర్ధారణ లేదు. త్రివిక్రమ్ ఇద్దరు యువ హీరోలతో మల్టీ స్టారర్‌కు రెడీ అవుతున్నాడనే గాసిప్ కూడా చక్కర్లు కొడుతోంది.