ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సక్సెస్ బాటలో రామ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2024, 04:44 PM

ఉగ్రవాదం, దేశ భక్తి, మత ఘర్షణల మీద ఇది వరకు ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఈ రిపబ్లిక్ డే (జనవరి 26)కి రామ్ ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే చిత్రం విడుదలైంది. దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్ తో కలిసి ఈ సినిమాను రూపొందించారు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేశారు. ఆయనే ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయాజుల  హీరోగా పరిచయమయ్యారు. ధన్యా బాలకృష్ణ  హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ విడుదలై మంచి ప్రశంసలను అందుకుంటున్న తరుణంలో దర్శకుడు మిహిరాం వైనతేయ తన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆయన సినిమా ప్రయాణంలో పడిన కష్టాన్ని, రామ్ మీద ప్రేక్షకులు కురిపిస్తున్న అభిమానం గురించి స్పందించారు. ‘చిన్నతనం నుంచి కూడా సినిమాలు అంటే ఇష్టం ఉండేది. ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతోంది. అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా చాలా మంది వద్ద పని చేశాను. ముత్యాల సుబ్బయ్య, తేజ, కృష్ణవంశీ ఇలా అందరి వద్దా పని చేశాను. ఆ తరువాత సొంతంగా కథలు, పాటలు రాయడం మొదలు పెట్టాను. రామ్  అనే కథను ముందుగా హీరో రామ్‌ పోతినేని అనుకుని రాసుకున్నాను. ఆ తరువాత ఆది పినిశెట్టితో చేయాలని అనుకున్నాం. హీరోగా చేసిన సూర్య నాకు ఎప్పటి నుంచో పరిచయం. ఓ సారి ఈ కథ చెప్పడం.. అల్లరి చిల్లరగా తిరిగే ఒక కుర్రాడు దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి రెడీ అవ్వడం అన్న క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ విపరీతంగా నచ్చడంతో తాను చేస్తానని అన్నాడు. నేను కూడా ఓకే చెప్పాను. ఆ టైంలోనే సూర్య దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా నిర్మాతగా మారిపోయారు. ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ఈ సినిమాను నిర్మించేందుకు అంతా సిద్దమయ్యాం. క్యాస్టింగ్ కూడా ఫైనలైజ్ చేశాం. సాయి కుమార్ డేట్స్ కోసం కొన్ని రోజులు ఆగాల్సి వచ్చింది. అలా ఆగినందుకు సాయి కుమార్ గారు దొరకడం, ఆయన పాత్రకు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం.. సినిమాకు మంచి పేరు వస్తుండటం చూస్తే ఆనందంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com