వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ సరిపోదా శనివారం అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రఖ్యాత OTT ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను పొందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ప్రకారం, స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ఈ సినిమా రైట్స్ కోసం 45 కోట్లు ఖర్చు చేసినట్లు లేటెస్ట్ టాక్. అయితే, ఈ విషయం గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావలిసి ఉంది.
ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుంది. ఈ చిత్రంలో SJ సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్‌కి చెందిన DVV దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చారు.