ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ తన తదుపరి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. లవ్ అండ్ వార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రణబీర్ కపూర్, అలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రంలో రణబీర్ కపూర్ గ్రే షేడ్ పాత్రలో నటిస్తున్నాడు. నటనకు సాలిడ్ స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి రణబీర్ తన ఆమోదం తెలిపినట్లు లేటెస్ట్ టాక్. లవ్ అండ్ వార్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని 2025 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa