మెగా కోడలు లావణ్యా త్రిపాఠీ పెళ్లి తర్వాత నటించిన వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేం అభిజీత్ హీరోగా నటించిన ఈ సిరీస్‌కు విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ సూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు. ఈ నెల 2న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మొదటిరోజు నుంచి ఈ సిరీస్‌కు పాజిటివ్ టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సిరీస్‌పై నాగబాబు రివ్యూ ఇచ్చారు. కోడలి నటించిన వెబ్ సిరీస్‌ను మామగారు మెచ్చుకున్నారు. తప్పకుండా చూడాల్సిన సిరీస్ ఇదని ట్విట్టర్ వేదికగా నాగబాబు తెలిపారు. ‘నా ఫేవరెట్ లావణ్య నటించిన ఈ అద్భుతమైన వెబ్ సిరీస్‌ను ఇప్పుడే చూశా. చాలా సరదాగా సాగే కథ ఇది. తెరకెక్కించడంలో దర్శకుడు ఎక్కడా గ్రిప్ మిస్ కాలేదు. హాట్‌స్టార్‌లో దీన్ని చెక్ చేయాలని నేను బాగా సిఫార్సు చేస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కథ: ఓసీడీ ఉన్న ఓ అమ్మాయి.. కరోనా సమయంలో తన అపార్ట్మెంట్లో ఉన్న చెఫ్‌తో ప్రేమలో పడుతుంది. తానెవరో చెప్పకుండా పనిమనిషిగా అతడికి దగ్గరవుతుంది. ఇక వీరి ప్రేమను బయటపెట్టడానికి ఒరిజినల్ పని మనిషి, ఆమె తమ్ముడు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రేమించిన అమ్మాయి అబద్దం చెప్పిందని హీరో ఆమెను దూరం పెడతాడు. చివరకు ఈ జంట కలిశారా.. ? అసలు పనిమనిషి ఇదంతా ఎందుకు చేయాల్సివచ్చింది అనేది కథ.