యాట సత్యనారాయణ దర్శకత్వంలో రానున్న తెలుగు చిత్రం "రజాకార్: ది సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్" సినిమా ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తించింది. 1947 ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 17, 1948 వరకు హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని హైలైట్ చేస్తూ జరిగిన సంఘటనలను వెలుగులోకి తీసుకురావడమే ఈ చిత్రం లక్ష్యం.
తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో రాజ్ అర్జున్ ఖాసిం రజ్వీ గా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ, ఇతర భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రజాకార్ల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, వారి త్యాగాలు మరియు పోరాట సమయంలో వారు ప్రదర్శించిన స్థైర్యాన్ని ఈ చిత్రం వెల్లడిస్తుంది.
ఈ చిత్రంలో మకరంద్ దేశ్పాండే, రాజ్ అర్జున్, బాబీ సింహా, వేదిక మరియు అన్నుశ్రియ త్రిపాఠి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మిస్తున్నారు.