కన్నడ స్టార్ నటుడు ఉపేంద్ర ఆగష్టు 2023లో తన రాబోయే పాన్-ఇండియన్ ఫిల్మ్ ప్రాజెక్ట్ UI ప్రమోషనల్ వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ చిత్రానికి ప్రముఖ నటుడు దర్శకుడుగా మారిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని మూవీ మేకర్స్ విడుదల చేసారు.
తాజాగా ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పుడు యూట్యూబ్ లో 25 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. లహరి ఫిల్మ్స్ మరియు వీనస్ ఎంటర్టైనర్స్ బ్యానర్లపై ఈ పాన్-ఇండియన్ ప్రొడక్షన్కు జి మనోహరన్ మరియు కెపి శ్రీకాంత్ నిర్మిస్తున్నారు.