ట్రోలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టనని నటి తమన్నా అన్నారు. ‘‘సెలబ్రిటీల విషయంలో నిజాలు తెలుసుకోకుండా ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెబుతుంటారు. మా జీవితంలో ఏం జరగనుందో కూడా వాళ్లే చెప్పేస్తుంటారు. అలాంటి వాటిపై నేను దృష్టి పెట్టను. వాటి గురించి ఆలోచిస్తే మనమే ప్రోత్సహించినట్లు అవుతుంది. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనే దానిపైనే శ్రద్ధ పెడతాను’’ అని తమన్నా అన్నారు.