మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. కొద్దిరోజుల క్రితమే ఈ పాన్-ఇండియన్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'ది రాజా సాబ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా షూటింగ్ కోసం మూవీ మేకర్స్ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ ని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలోని సెకండ్ హాఫ్ మేజర్ పార్ట్ షూటింగ్ ఈ సెట్లోనే జరుగుతుంది అని ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2024లో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ హారర్-కామెడీ డ్రామాకి థమన్ సంగీతం అందించనున్నారు.