ముంబై వేదికగా మిస్ వరల్డ్-2024 పోటీలు అట్టహాసంగా జరిగాయి. 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిస్కోవా విజేతగా నిలిచి, మాజీ మిస్ వరల్డ్ కరోలినా బిలావ్స్కా చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్నారు. ఇక రన్నరప్‌గా లెబనాన్ భామ యాస్మినా జైటౌన్ నిలిచారు. ఈ పోటీల్లో 112 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడ్డారు.