అనుదీప్ కెవి దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాని చేయటానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రవితేజకి జోడిగా రుక్మిణీ వసంత్ నటించనున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం వచ్చే నెలలో గ్రాండ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభించబడుతుందని వార్తలు వస్తున్నాయి. హరీష్ శంకర్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే,ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.