గత ఏడాది 'వారిసు', 'లియో' చిత్రాలతో ఆకట్టుకున్నారు విజయ్. ఈ ఏడాది 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. యువన శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం విజయ్ స్వయంగా ఓ పాట పాడుతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనిపై సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కూడా స్పష్టత ఇచ్చారు. ఇటీవల బెంగళూరులోని ఓ కాన్సెర్ట్‌లో పాల్గొన్న యువన్ తమ రాబోయే సినిమా కోసం విజయ్ గాత్రంతో ఓ పాట రికార్డు చేసినట్లు వెల్లడించారు. ఈ గీతానికి వెంకట్ ప్రభు తండ్రి గంగై అమరన్ సాహిత్యం అందించినట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా,స్నేహ, లైలా తదితరులు కీలక పాత్రధారులు.