ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బయటే కాదు సోషల్ మీడియాలోనూ ఆయనకున్న క్రేజ్ వేరు. ‘బాహుబలి’తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న ఆయన తాజాగా ఓ అరుదైన రికార్డు దక్కించుకున్నారు. ట్విట్టర్లో గతేడాది ఎక్కువ వాడిన హ్యాష్‌ట్యాగ్స్ జాబితాలో ప్రభాస్ పేరు టాప్ ప్లేస్‌లో ఉంది. సంవత్సరంపాటు మన దేశంలో నెటిజన్లు ఎక్కువగా ఉపయోగించిన హ్యాష్‌ట్యాగ్‌లను ఎక్స్ తాజాగా ప్రకటించింది. ‘టాప్ హ్యాష్‌ట్యాగ్స్ ఇన్ ఇండియా’ పేరుతో ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ విభాగంలో ప్రభాస్ హ్యాష్‌ట్యాగ్ ఏడో స్థానంలో ఉంది. అలాగే ఆయన నటించిన ‘ఆదిపురుష్’ తొమ్మిదో ప్లేస్‌లో ఉండటవ విశేషం. ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక హీరో ప్రభాస్ కావడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.