గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా తన తదుపరి చిత్రాన్ని సంపత్ నందితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ బ్యూటీ ఇప్పుడు చారిత్రక బ్రాండ్‌ను కైవసం చేసుకుంది. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, చారిత్రాత్మక పానీయాల బ్రాండ్ అయిన రస్నా బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా ఎంపికైంది. త్వరలో విడుదల కానున్న బ్రాండ్ కోసం ఆమె ఇప్పటికే కొన్ని యాడ్స్ కోసం చిత్రీకరించింది. తమన్నా కెరీర్ ముగింపు దశకు చేరుకుందని అందరూ భావించే తరుణంలో ఆమె మళ్లీ బౌన్స్ అవుతోంది.