రాజ్‌కుమార్ రావ్ మరియు శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలలో నటించిన స్త్రీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి మరియు అభిషేక్ బెనర్జీ ఇతరలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సీక్వెల్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ సీక్వెల్లో వరుణ్ ధావన్ భేదియాగా కనిపించనున్నాడు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది. ఈ హర్రర్ చిత్రాన్ని దినేష్ విజన్ మరియు జియో స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.