అమెరికన్ ప్రముఖ ర్యాపర్ డిడ్డీ (54)పై కేసు నమోదైంది. అమ్మాయిల ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నాడని న్యూయార్క్‌లోని ఫెడరల్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పలువురు ఫిర్యాదులు చేయడంతో లాస్ ఏంజిల్స్, మయామిలోని డిడ్డీకి చెందిన రెండు నివాసాలను ఫెడరల్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఏజెంట్లు శోధించారు. వివరాలను మాత్రం అధికారులు బహిరంగపరచలేదు.